*ఇటీవల రెండోసారి జిల్లా టీడీపి అధ్యక్షుడిగా నవీన్ నియామకం*
*తన అనుచరులతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన శివ*
మన ధ్యాస ప్రతినిథి శంఖవరం:
కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ను పార్టీ అధిష్టానం ఆదేశాలతో రెండోసారి నియమితులైన సందర్బంగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్నా శివ తన అనుసురులతో కలిసి జగ్గంపేట మండలం ఇర్రిపాకలో నవీన్ వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన అనుచరులను ఆయనకు పరిచయం చేశారు.నూతన జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరిగిలేని శక్తిగా ఎదగాలని రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్,రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్నా శివ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి,మాజీ ఎంపీటీసీ కంచిపోయిన శ్రీను, కత్తిపూడి గ్రామ కమిటీ అధ్యక్షుడు కేళంగి జన,యువ నాయకులు రౌతు శివ,గాబు శివ,జ్యోతుల శివ,ఉల్లి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు