
తవణంపల్లి డిసెంబర్ 27 మన ద్యాస
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికై పోలీసులు విస్తృతంగా ఫుట్ ప్యాట్రోలింగ్ నిర్వహించారు.గ్రామాల్లో నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజల్లో భద్రతా భావనను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.సున్నిత ప్రాంతాలు, ప్రధాన వీధులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడారు.ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్ఐ నాయక్ సూచించారు.శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.