
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పరిపాలన పాలన సౌలభ్యం కోసం సొంత నిధులతో కావల్కర్ ని గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసివేసిన కావలికర్ల స్థానంలో గ్రామ యువకుడిని నియమించినట్లు తెలిపారు. కావాలి కార్ యొక్క వేతనం అందించేందుకు సర్పంచ్ కే శ్రీనివాస్ గౌడ్ ముందుకు వచ్చినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిపి బాలకృష్ణ , సి పి తిరుపతి,వై చంద్రకాంత్, రమేష్ మేకలి రాజు, అశోక్ వెంకటయ్య హనుమంతు. సుదర్శన్ రెడ్డి వార్డు సభ్యులు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.