మన న్యూస్;పినపాక పంచాయతీ లలో సెక్రటరీలు పారిశుధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం చేయరాదని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం పినపాక, జానంపేట, దుగినే పల్లి లో ఆయన పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ లలో పారిశుధ్యం తొ పాటు శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, మంచినీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచడం వంటి పనులు కచ్చితంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చూడటమే కాకుండా ఫ్రైడే డ్రైడే పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాలువలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాలని సూచించారు. ఇంటి పన్నుల వసూలు, రికార్డులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా నిర్వహించిన సెక్రటరీలను అభినందించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు ఉమామహేశ్వరరావు, రహీం, సంధ్య, జైపాల్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.