మన న్యూస్:పినపాక ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గాభవాని అన్నారు. మంగళవారం పినపాక పిహెచ్సి పరిధిలోగల పాతరెడ్డిపాలెం ఏఎన్సీ కేంద్రాన్ని పరిశీలించారు. గర్భిణీ లను గుర్తించి ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. వారికి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆరోగ్య జాగ్రత్తలు వివరించాలని డాక్టర్ దుర్గాభవాని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైద్య సిబ్బంది పాల్గొన్నారు.