మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు పండించే మొక్కజొన్న,పెసర పంటలకు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు కోరారు. పాచిపెంట మండలం లో కుడుమూరు గ్రామం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ పంటలపై బ్యాంకులో రుణాలు తీసుకోని రైతులు సమీప మీసేవ సెంటర్లో గానీ, పంటల భీమా పోర్టల్ లో గాని,పోస్ట్ ఆఫీస్ లో గాని, గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా గాని పంటల భీమా చెల్లించవచ్చని ఆధార్ కార్డ్ షోయింగ్ సర్టిఫికెట్ పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకు ఎకౌంటు పుస్తకం జిరాక్స్లు తీసుకొని వెళితే మొక్కజొన్నకు 72 రూపాయలు 40 రూపాయలు ఎకరానికి చెల్లించి పంటల భీమా పొందవచ్చునే తెలిపారు. వరి పంటకు డిసెంబరు 31 వరకు సమయం ఉందని మొక్కజొన్న పెసర పంటలకు డిసెంబర్ 15 ఆఖరి రోజున తెలిపారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా,అనుకోని విధంగా వరదలు కరువు వడగల్లు లేదా అగ్ని ప్రమాదాల ద్వారా నష్టపోయినట్లయితే 48 గంటలలోగా సంబంధిత భీమా అధికారికి తెలియజేసి పంటల బీమా పొందవచ్చని తెలిపారు.పంటల బీమా ద్వారా మొక్కజొన్నకు గరిష్టంగా 36000 పెసర పంటకు 20,000 వరి పంటకు 42000 తెలిపారు ఊహించని అవంతరాలు వచ్చినప్పుడు రైతులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. కాబట్టి రైతులందరూ పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు.మరింత సమాచారం కొరకు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఏఏ భారతి ప్రకృతి సేద్య సిఆర్పి సురేష్ గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.