
మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- మదాసి కురువ సంఘ సభ్యులు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ అన్నారు. మక్తల్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన మదాసి కురువ నూతన సర్పంచులు ,ఉపసర్పంచ్లు, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అందరికి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ తో పాటు ముఖ్య నేతలు మాట్లాడుతూ,మదాసి కురువలు ఆర్థికంగా విద్యాపరంగా ఎందులోనూ తీసిపోరని, రాబోయే రోజుల్లో అత్యధిక స్థానాల్లో ఎంపీటీసీ ,జడ్పిటిసి, సింగిల్ విండో, మున్సిపల్ వార్డు మెంబర్లు గా గెలిచి రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ డైరెక్టర్, నారాయణపేట జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు తంగిడి నాగరాజు, మాజీ జెడ్పిటిసి, జిల్లా మదాసి కురువ సంఘం అధ్యక్షులు వేంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు సార్, మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులు ఓబులాపూర్ అంజప్ప, నారాయణపేట నియోజకవర్గ అధ్యక్షులు హనుమంతు, మక్తల్ మండల అధ్యక్షులు కురువ లింగం, మాగనూరు మండల అధ్యక్షులు యుగంధర్, కృష్ణ మండల అధ్యక్షులు మహాలింగ, ఉట్కూరు మండల అధ్యక్షులు పొర్ల లింగప్ప, కుల పెద్దలు బూత్పూర్ హనుమంతు, ముసలాయపల్లి రాజు, గజలప్ప, హిందూపూర్ శంకర్, సంఘం సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.