
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గురువారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మహమ్మద్ అలీ షబ్బీర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కామారెడ్డి జిల్లా రాజకీయ పరిస్థితులు,కాంగ్రెస్ పార్టీ బలోపేతం,ప్రజా సమస్యలు, అలాగే రానున్న పార్టీ కార్యక్రమాలపై స్నేహపూర్వకంగా చర్చించారు.కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ షబ్బీర్ అనుభవం, మార్గదర్శకత్వం పార్టీ శ్రేణులకు ఎంతో దోహదపడుతుందని ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.
దీనికి స్పందించిన షబ్బీర్ అలీ,కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు.పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ భేటీ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత, సమన్వయాన్ని మరింత బలపరిచే సూచనగా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మొహమ్మద్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.