
మన ధ్యాస, నెల్లూరు రూరల్,డిసెంబర్ 23:నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు కాళహస్తి భవన్ అనుదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలలో శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్ , ఇతర నాయకులు, పాస్టర్లతో కలిసి పాల్గొని, కేక్ కట్ చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి.క్రీస్తు ప్రభువు సందేశాన్ని చదివి వివరించడంతో పాటు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్లు.ప్రజలందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ............ప్రభువు ఏసుక్రీస్తు జననం సందర్బంగా క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకునే పండుగ అని అన్నారు.ప్రభువు ఏసుక్రీస్తు చూపించిన శాంతి సందేశం ప్రపంచ మానవాళికి ఆచరణీయం అని అన్నారు.దాదాపు 10 రోజుల ముందు నుండి పండుగ వాతావరణంలో క్రిష్టియన్ సోదరులు జరుపుకుంటున్న ఏసు క్రీస్తు ప్రభువు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నడం సంతోషంగా ఉంది అని తెలియజేశారు.ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ క్రిస్టియన్ సోదరులు శాంతికపోతాలుగా సమాజంలో వ్యవహరిస్తున్నారు అని అన్నారు.ప్రభువు ఏసుక్రీస్తు జీవితం పక్కవారికి సహాయం చేస్తూ, శాంతి మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలో చెబుతుంది అని తెలియజేశారు.నేటి సమాజంలో ప్రభువు చూపించిన శాంతి మార్గాన్ని మానవాళికి చూపించే బాధ్యతను పాస్టర్లు తీసుకోవాలి అని అన్నారు.నేడు సమాజంలో యువత తప్పుదోవ పట్టడంతో, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి అని అన్నారు.ప్రభువు ఏసుక్రీస్తు లాంటి మహనీయుల సందేశాలతో మార్పు తీసుకొనివచ్చి, అందరూ శాంతి మార్గాన్ని అనుసరించేలా పాస్టర్లు కృషి చెయ్యాలి అని తెలియజేశారు.రాజకీయాలలో, కులం, మతం, వ్యక్తిత్వాన్ని సైతం వాడుకుంటున్నారు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి తన మతం మానవత్వమని స్పష్టం చేశారు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలనను అందించి, అందరి మనసుల్లో తనదైన ముద్రను పెనవేసుకున్నారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఊరూరా, వాడవాడలా, ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అన్ని వర్గాలకు ఆయన చేసిన మేలుకు నిదర్శనం.ప్రభువు ఏసుక్రీస్తు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డిపై ఉండాలని, మీ అందరి ప్రార్థనలతో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియదేశారు.




