
బంగారుపాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు వైయస్సార్సీపీ పార్టీ యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలమనేరు కు చెందిన అక్షర మానస వికలాంగులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 53 జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హ్యాపీ బర్త్డే టూ యు అంటూ పిల్లలు నినాదాలు చేశారు. ఇలాంటి మానసిక పిల్లల పట్ల కరుణ గల ప్రేమతో ప్రతి ఒక్కరు ఆదరించాలని తుంబకుప్పం యువ నాయకులు మంజునాథ్ తెలియజేశారు. వారి జీవితం మున్ముందు బాగుండాలని ఆ దేవున్ని ప్రార్థించినట్లు యువ నాయకుడు మంజునాథ్ తెలిపారు.