
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిసెంబర్ 24వ తేదీన కోస్గి రానున్న నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ సైదులు, ఎస్ బి ఎస్సై నరేష్, ఎస్ఐ లు బాలరాజు, విజయ్ కుమార్ లు కలిసి కోస్గి మండల కేంద్రం కొడంగల్ రూట్ లోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ వద్ద బందోబస్తు, హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని, పార్కింగ్ స్థలాలు, భద్రతా పరమైన అంశాలు, బ్యారికేడింగ్, బందోబస్తు వంటి ముఖ్యమైన ఏర్పాట్లను ప్రత్యేకంగా అధికారులతో సమీక్షించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సంబంధిత విభాగాలకు సూచించారు. ప్రజా ప్రతినిధులు పాల్గొనే సమావేశంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయనున్నట్లు డిఎస్పీ తెలిపారు.