
యాదమరి, స్వర్ణసాగరం డిసెంబరు-20 చిత్తూరు పట్టణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కె. గొల్లపల్లె పాఠశాల విద్యార్థులకు సాయి బాబా వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “కర్తవ్యమే దైవం” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు జె. అమరనాథ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని హెచ్.ఎం. ఎ.పి. లలిత తెలిపారు. వ్యాసరచన పోటీలను సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు మదన్ మోహన్ రెడ్డి, చిన్నదొరై సమర్థవంతంగా నిర్వహించారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన, శాంతి, ప్రశాంతత పెంపొందుతాయని సీనియర్ గణిత ఉపాధ్యాయులు కనకాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి భాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సుల్తాన్, రంగనాథం, ఆశ, కె. భారతి, రమాదేవి తదితర ఉపాధ్యాయులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో విలువలు, కర్తవ్య భావన పెంపొందించడమే లక్ష్యంగా సత్యసాయి ట్రస్ట్ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.