మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుండి ఆయిజ మధ్య తాటికుంట గ్రామ స్టేజి దగ్గర ఓ మహిళ తన ఇద్దరు 3, 6 సంవత్సరాల చిన్న పిల్లలను చేయితో పట్టుకుని భయాందోళనకు గురైంది. వివరాలలోకి వెళితే గద్వాల నుండి ఆమె సొంత ఊరు అయినా తాటికుంట గ్రామానికి గద్వాల జిల్లా కేంద్రంలో నుండి ఆర్టీసీ TS 33 T 3006 నెంబర్ గల బస్సు ఎక్కింది ఆమె భర్త గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కడానికి సిద్దంగా ఉన్నాడు, ఆమె (ప్రయాణికురాలు) బస్ డ్రైవర్ తో సార్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కడం కోసం మా వాళ్ళు ఉన్నారు దయచేసి బస్సు ఆపండి సార్ అని ముందుగానే బస్సు డ్రైవర్ కు తెలియజేయడం జరిగింది.
ఆ బస్సు డ్రైవర్ హాస్పిటల్ దగ్గర బస్సు ఆపకపోవడంతో సార్ ఇక్కడ మా వాళ్లు బస్సు ఎక్కడానికి ఉన్నారు బస్సు ఆపండి నేను అయిన బస్సు దిగుతా సార్ అని కేకలు వేసిన వినిపించుకోకుండా బస్సు ముందుకి వెళ్లడంతో ఆ బస్సు కండక్టర్ ను అడగగా నేనేం చేయలేనని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ప్రయాణికురాలు చేసేదేమి లేక ఆమె సొంత ఊరైన తాటికుంట స్టేజి దగ్గర బస్సు దిగింది. అసలే ఆ స్టేజ్ నుండీ తాటికుంట గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల చిన్నపిల్లలతో ఉన్నా ఆ తల్లి భయాందోళనకు గురవుతుంది దయచేసి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఆ డ్రైవర్ మీద తీసుకోవాల్సిందిగా కోరుకున్నారు.