మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ఉద్దగిరి సోమరాజు(98)శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.ఆయన 35 సంవత్సరాల పైగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సేవలందించడమే కాకుండా వందలాది మంది విద్యార్థులకు నవోదయ, భూపతిపాలెం, కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చి వేలాది మంది బావిభారత పౌరులను తీర్చిదిద్దారు.ఆయన మృతి పట్ల యుటిఎఫ్ మాజీ అధ్యక్షులు ఎండి ఇబ్రహీం ఖాన్, ఏ బి వి ప్రసాద్, జాన్ విల్సన్ బాబు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు వుడతా రామచందర్రావు, వాసా పుల్లయ్య, మజ్జి తాతారావు, జోగిరాజు పలువురు రాజకీయ వ్యాపార ప్రముఖులు, పూర్వపు విద్యార్థులు సంతాపం తెలిపారు.