మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత కు ముస్తాబు కార్యక్రమం దోహదం చేస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని ఏలేశ్వరం మండలం పరిధి సి. రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు లాజరస్ , విద్యా కమిటీ చైర్మన్ మొల్లి కృష్ణ ఆధ్వర్యంలో ముస్తాబు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తూమురౌతు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతో పాటు పరిసరాల పరిశుభ్రత కు ఎంతో ప్రభావితం చేస్తుందని విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరుస్తుందని, ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుందని ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య,వీర్రాజు,చిన్నారావు,సుమలత, సత్యవతి,వరలక్ష్మి,ఎండిఎం సిబ్బంది పాల్గొన్నారు.