మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపివో పద్మావతి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా పాఠశాల విద్యార్థులు,ఐ సి డి యస్ ఆధ్వర్యంలో వందేమాతర గీతాన్ని ఆలపించి,బాల్య వివాహ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేపట్టారు.ఈ సందర్భంగా సీడీపీఓ పద్మావతి మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమాన్ని నవంబర్ 27 నుండి జనవరి మార్చి 8 వరకు మూడు దశల్లో నిర్వహిస్తున్నామని,నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం వల్ల చట్టపరమైన సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు.బాల్య వివాహ నిషేధ చట్టం-2006 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండకుండా వివాహం చేస్తే చట్ట రీత్యా నేరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది దేవి, సూపర్వైజర్ కె సూర్య కుమారి,పలువురు అంగన్వాడీ సిబంది,పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.