మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయము నందు ఈ నిర్వహించిన హుండీ లెక్కింపు నందు శ్రీ అమ్మవారి హుండీ ద్వారా రూ.87,02,578-00, శ్రీ స్వామి వారి హుండీ ద్వారా రూ.18,63,642-00, అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ. 38,216-00, మొత్తం కలిపి రూ.1,06,04,436-00 ఆదాయం వచ్చినది. మరియు విదేశీ కరెన్సీ - US Dollors 17, ఆస్ట్రేలియా కరెన్సీ 5, స్వీడన్ కరెన్సీ 1000,
మిశ్రమ బంగారు 61 గ్రాములు, మిశ్రమ వెండి 513 గ్రాములు వచ్చినది. ఈ హుండీ లెక్కింపు శ్రీయుత సహాయ కమీషనర్, దేవాదాయ శాఖ, మహబూబ్ నగర్ మధనేశ్వర్ రెడ్డి గారి పర్యవేక్షణలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమము నందు ఆలయ ఈ.ఓ. పురేందర్ కుమార్, ఛైర్మెన్ బి. నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలు జగన్ మోహన్ నాయుడు, శ్రీమతి నాగ శిరోమణి, విశ్వనాథ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, గోపాల్, జి. వెంకటేశ్వర్లు, ఆలయ ఉప ప్రధాన అర్చకులు & ఎక్స్ అఫిషియో సభ్యులు డి. ఆనంద్ శర్మ, అర్చక మరియు సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు, గద్వాల, కొత్తకోట, కర్నూలు, హైదరాబాద్ కు చెందిన వివిధ సేవా సంస్థలు పాల్గొన్నారు.