
మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, డిసెంబర్ 16;ఎప్పుడూ నాలుగు గోడల మధ్య చదువులే కాకుండా విద్యార్థులను క్రీడల దిశగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణం డి ఎల్ ఎన్ ఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన 69 వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వాలిబాల్ కోర్టులో బంతి ఎగురవేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ... క్రీడాకారుల మధ్య పరస్పర సహకారం, కష్టపడే స్వభావం వుంటేనే వాలిబాల్ లాంటి క్రీడలో రాణించ గలుగుతారన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని, గెలిచినా, ఓడినా, ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకూడదన్నారు. నెల్లూరు జిల్లా మీద నమ్మకంతో 12 జిల్లాల నుంచి వాలీబాల్ పోటీలకు పిల్లలను పంపిన వారి తల్లి తండ్రులను ఆమె అభినందించారు. బుచ్చిరెడ్డి పాళెంలో జరుగుతున్న రాష్ట స్థాయి పోటీలలో విజేతలై కడపలో జరిగే నేషనల్స్ లో ఎంపిక కావాలని క్రీడాకారులకు ఆమె ఆశ్వీరచనాలు అందచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సాహకాలు అందచేస్తుందన్నారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో క్లాస్ కు ఒక టీచర్ విధానం, పాఠశాలలో నాణ్యమైన భోజనం, నాణ్యమైన బ్యాగులు, స్టడీ కిట్ల గురించి వివరించారు. ఇటీవల రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాథశాలలో నిర్వహించిన పిటిఎం గురించి ఆమె మాట్లాడుతూ..... విద్యార్థులు, తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం అవసరమన్న విషయాన్ని మంత్రి లోకేష్ గారు గుర్తించి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ గురించి ఆమె తెలిపారు. నెలలో రెండు సార్లు ప్రజా ప్రతినిధులు విద్యాలయాలను సందర్శించి బోధన మరియు విద్యార్థుల స్థితిగతులను పర్వేక్షించాలని కోరారు. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్జీఎఫ్ అధికారులు, నిర్వాహకులు, కోచ్లు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ఆమె అభినందనలు తెలిపారు. క్రీడా మైదానాలలో సదుపాయాలు మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కమిషనర్ అన్వర్ భాష, సీఐ శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టిడిపి పట్టణ గుత్తా శ్రీనివాసులు, మాజీ పట్టణ అధ్యక్షులు ఎంవి శేషయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, టిడిపి నాయకులు కార్యకర్తలతో పాటు బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.










