మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం; ఏలేశ్వరం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా మహిళ ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యలు, ఆర్టీసీ సిబ్బందిపై పెరిగిన పని భారం నకు తక్షణ పరిష్కారం కోరుతూ, ఏలేశ్వరం బస్సు డిపోలోని అన్ని అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడి మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ ను ఉద్దేశించి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఏ ఎస్ నారాయణ మరియు ఏలేశ్వరం డిపో కార్యదర్శి మాట్లాడుతూ,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలకు ముందే ఆర్టీసీ అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ పథకం అమలవుతున్న వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లి అధ్యయనం చేయగా ఈ పథకం ద్వారా మహిళలు ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్న విషయాన్ని గుర్తించడం జరిగింది అని డిమాండ్ ఏ మేరకు పెరగబోతున్నదో ముందస్తు అంచనాలు రూపొందించడం జరిగి. ప్రభుత్వం కొత్త బస్సులును ఏమాత్రం పెంచకుండా స్త్రీ శక్తి పథకం అమలు చేయడంతో ప్రయాణికులు మరియు ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవ్వటమే కాకుండా ప్రమాదాలకు సైతం గురవుతున్నారని అన్నారు కావున తక్షణం బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని స్త్రీ శక్తి పథకం వలన రన్నింగ్ టైం లో సరిపోవటం లేదని అందువలన దిగే వారి టిక్కెట్లను మాత్రమే చెకింగ్ చేసే విధంగా చెకింగ్ విధానంను మార్చి ఆలస్యాలను నివారించాలని మరియు అన్ని బస్సులకు హైడ్రాలిక్ డోర్స్ ఏర్పాటుచేసి మహిళా ప్రయాణికులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే డోరు లేని బస్సుల్లో జరిగిన ప్రమాదాలకు సిబ్బందిని బాధ్యులను చేయటం సరి కాదని కోరారు. ఈ గేట్ మీటింగ్లో హాజరైన కార్మికులను ఉద్దేశించి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేఎస్ రావు మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం ప్రభుత్వం 75 రోజులకు గాను, 400 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు చేసిందని, అంటే నెలకు సుమారు 160 కోట్ల రూపాయలు అవుతుందని, అందువలన అమ్మిన ప్రతి టిక్కెట్ కు ప్రభుత్వం లెక్క కట్టి ఇవ్వడం లేదన్న సంగతి తెలుస్తోందని తెలియజేశారు. మరియు వెంట వెంటనే డబ్బుల టికెట్లు, మరియు స్త్రీ శక్తి(0) టిక్కెట్లు ఇవ్వడం వలన కండక్టర్లకు ఎక్కువగా పొరపాట్లు జరుగుతున్నాయని, వాటి వల్ల కండక్టర్ల ఉద్యోగ భద్రత కు ముప్పు వాటితోందని కావున రెండు రకాల టిక్కెట్లు ఇచ్చే విధానం తీసివేసి, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్లు అనే నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు . ఉచిత బస్సు పథకమునకు ఏ విధమైన అదనపు ఏర్పాట్లు చేయకుండా అమలు చేయడంలో జరుగుతున్న ఈ అసౌకర్యానికి ప్రయాణికులు అసహనానికి లోనవుతున్నారని, వారి అసహనం ప్రదర్శనకు, విధులలో ఉన్న సిబ్బంది ఎరగా మారి దాడులకు గురవుతున్నారని, అన్నారు. బస్సుల్లో 70 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతించేలా నిబంధనలు మార్చాలని, విధులలో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన వారిపై , హత్యాయత్నం బి ఎం ఎస్ 109 కేసు మోపి శిక్షించాలని, దాడికి గురైన సిబ్బంది తిరిగి వీధుల్లో చేరేవరకు ఆన్ డ్యూటీ గా పరిగణించాలని, తక్షణ వైద్యం కొరకు కార్పొరేట్ వైద్యం చేయించాలని , ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ గేట్ మీటింగ్లో ఏలేశ్వరం డిపో కి చెందిన సుమారు 50 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ గేట్ మీటింగ్ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ కేటి మూర్తులు, ఈ యు ప్రెసిడెంట్ ఎల్విఎస్ నారాయణ, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ నేకూరి ప్రకాశరావు, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఏ ఎస్ నారాయణ, స్టేట్ సెక్రటరీ కేఎస్పి రావు, కండక్టర్ పీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.