*పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన బొదిరెడ్డి యువసేన*
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:
ఏలేశ్వరం పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొదిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు బొదిరెడ్డి యువసేన, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఉదయనుండి బొదిరెడ్డి గోపి నివాసం వద్ద అభిమానులు, పలువురు ప్రముఖులు,పలు శాఖల అధికారులు గోపికు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు.పండ్లు పంపిణీ చేశారు, భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నందు గోపి యువసేన సభ్యులు జుత్తుల శ్రీను అన్నదానం చేపట్టారు. విద్యార్థులకుగోపీ కుటుంబ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు.ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అన్నదానం చేపట్టారు.ఈ సందర్భంగా గోపి నివాసం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 60 మంది రక్తదానం చేసి అభిమానం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో గట్టిం పెద్దకాపు,కౌన్సిలర్లు కోణాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు,పెంద్ర శ్రీను,జొన్నడ వీరబాబు,వాగు రాజేష్, అనంతారపు రాజు, సామతులు గోపి,రుచి రమేష్,సూరిబాబు, గ్రామాల నాయకులు కార్యకర్తలు, గోపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.