మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్అ న్నారు.నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా సమీపంలో సోమవారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానాలు విధించారు. వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడిపించవద్దని సూచించారు. వాహనదారులు వాహనాలు నడిపే క్రమంలో ప్రతి ఒక్క వాహనంకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని అన్నారు. బైకు వాన ధరలు హెల్మెట్ ధరించి వాహనం నడిపిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చు అని వాహనదారులకు సూచించారు.