మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాముల వర్దంతిని హిస్టీరి, ఎకనోమిక్స్ మరియు పోలిటికల్ సైన్స్ విభాగాల ఆద్వర్యంలో నిర్వహించారు.ఈ కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు (1901-1952) తెలుగు ప్రజల కోసం,భాషా ప్రయుక్త ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి.ఆయన గాంధేయవాదని,స్వాతంత్య్ర సమరయోధుడు,ఈయన త్యాగం ఫలితంగా1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రంమే ఆయన ఆశయమని 58 రోజుల నిరాహారదీక్ష తర్వాత,1952 డిసెంబర్ 15న మరణించారని ఆయన మరణం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించి,మూడు రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందని తెలియజేశారు. కాబట్టి మహనీయుల జీవిత చరిత్రలు చదువుతూ వారిని గౌరవిస్తూ మనం కూడా ఉన్నత శిఖరాలు అదిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమమలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. ప్రయాగ మూర్తి ప్రగడ డా.శివప్రసాద్,వి.రామరావు,కె.సురేశ్,వీరభద్ర రావు, ఎస్కే మదీనా,శ్రీ లక్ష్మి,కె బంగార్రాజు,మేరి రొసిలిన పుష్పా,సతీశ్ పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.