
మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 13:ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా నెల్లూరు నగరంలో అనిల్ గార్డెన్స్ లో శనివారం ప్రారంభమై 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు భారీ ఎడ్యుకేషనల్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమశేఖర్ తెలిపారు. ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పోలో దేశవ్యాప్తంగా పేరొందిన 80కు పైగా విద్యాసంస్థలు పాల్గొననున్నాయని తెలిపారు. మొదటి రోజు 470 ఎంక్వైరీ జరిగినాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ, గుజరాత్ నుండి విద్యా సంస్థలు పాల్గొన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీబీఏ, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్, డిజైన్, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందించనున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులకు అవసరమైన కోర్సుల వివరాలు, అర్హతలు, ఫీజు నిర్మాణం, స్కాలర్షిప్లు, ప్రవేశ విధానాలు, కెరీర్ అవకాశాలు వంటి అంశాలపై నిపుణులు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు ఈ ఎక్స్పో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యారంగ నిపుణులు, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్లు పాల్గొని విద్యార్థుల సందేహాలకు ప్రత్యక్షంగా సమాధానాలు ఇస్తారని చెప్పారు. మారుతున్న విద్యా విధానాలు, భవిష్యత్లో అవకాశాలున్న కోర్సులపై స్పష్టమైన దిశానిర్దేశం అందిస్తారని వివరించారు.నెల్లూరు నగరంతో పాటు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ప్రవేశం ఉచితం కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్స్పో కొనసాగుతుందని తెలిపారు..

