
సీఎం సహాయనిధి ద్వారా రూ.65 లక్షల చెక్కుల అందజేత..లబ్ధిదారుల ముఖాల్లో వెలిగిన వెలుగు- కూటమి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వమని కితాబు.
వింజమూరు డిసెంబర్ 12, మన ధ్యాస న్యూస్,

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మొత్తం 74 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 65 లక్షల రూపాయల ఆర్థిక సహాయంను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,లబ్ధిదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాల పట్ల మానవతా భావంతో ముందడుగు వేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతోమందికి జీవనాధారం కలిగే విధంగా సహాయం అందిస్తున్నారని తెలిపారు.వైద్య చికిత్స ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న అనేక కుటుంబాలు ఈ సహాయంతో ఆర్థికంగా కోల్పోని మళ్లీ జీవనోపాధి వైపు అడుగులు వేస్తున్నాయని,ఈ మహత్తర సేవా కార్యక్రమం వల్ల వేలాదిమంది నిరుపేద ప్రజలు ఇప్పటివరకు లబ్ధి పొందారని గర్వంగా పేర్కొన్నారు.అలాగే,గత ప్రభుత్వంలో ప్రజలు ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎప్పుడూ చూడలేదని,అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలపై స్పందిస్తూ, అవసరమైన చోట వెంటనే ఆర్థిక సహాయం అందించి నిజంగా ప్రజల ప్రభుత్వం అనే పేరుకు తగిన విధంగా పనిచేస్తోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.లబ్ధిదారులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి తమ కుటుంబాలకు ఒక పెద్ద ఆదరణగా నిలిచిందని నారా చంద్రబాబు నాయుడు కి, కూటమి ప్రభుత్వము నకు అభినందనలు తెలిపారు.
