మన న్యూస్ పాచిపెంట డిసెంబర్9: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోబొడ్డపాడు గిరిజన బడి పిల్లలకు స్కూలు బిల్డింగు నిర్మాణము వెంటనే చేపట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం పాఠశాల పిల్లలు వారి తల్లిదండ్రులతో చేయడం జరిగింది. స్థానిక గిరిజనులైన. పోయ్ శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగం పట్ల ప్రభుత్వాలునిర్లక్ష్యం కారణంగా పిల్లలకు చదువుకు దూరం అవుతున్నారని స్కూల్ బిల్డింగు నిర్మాణం చేపట్టి గిరిజన ప్రాంతంలో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు గిరిజన గ్రామంలో చదువుకున్న పిల్లలకు గ్రామంలో సొంతంగా నిర్మించుకున్న చిన్నపాటి పాక లో చదువు చెప్తున్నారని ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వెంటనే స్కూలు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని అన్నారు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పీవోలు ఆదేశాలు జారీ చేసి ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రభుత్వంపై నివేదికలు పంపాలని అన్నారు ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన హిల్ టాప్ గ్రామాల్లో నేటికీ భూత వైద్యం చెల్లింగు చేతబడులు పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వైద్యం పట్ల కూడా అవగాహనలేదని దీనంతటికీ కారణం చదువు లేకపోవడమే చిన్న వయసులో బాల్యవవాహాలు దీని కారణంగా రక్తహీనత వంటి జబ్బులతో మరణాలకు దగ్గరవుతున్నారని అధికారులు యుద్ధ ప్రాతిపదికన శ్రద్ధ వహించి బొడ్డపాడు గిరిజన గ్రామం వద్ద బడి పిల్లలకు స్కూలు బిల్డింగు శాంక్షన్ సేవించి వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు ఏజెన్సీ గిరిజన గ్రామాలపై శ్రద్ధ వహించకపోతే భవిష్యత్ పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని అన్నారు. పోయి శ్రీరామ్ ఎస్ ఆదయ్య మాట్లాడుతూ స్కూలు బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టి మా ప్రాంతం గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని కోరారు.