
బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస
బంగారుపాళ్యం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా మెయిన్ రోడ్ పక్కనే కాలువ లేక ప్రవహిస్తున్న మురుగు నీరు? పలుమార్లు పేపర్లకు వేసిన అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోని వైనం. వివరాల్లోకి వెళితే మండల కేంద్రం, రోడ్డుకు ఇరువైపులా కూడా నిత్యం వ్యాపారలు జరిగే అంగుళ్ళు మరియూ అనునిత్యం జన సంచారంతో రద్దీ. అదే కాలువ దగ్గర వాహనాలు ఆపాలి, ఆ కాలువనే దాటుకుని వెళ్లి నిత్యవసారాలు మరియూ ఇతరత్ర కొనాలి మళ్ళీ తిరిగి ఆ కాలువ మీదగానే రావాలి. ఎంతో మంది కాలు జారీ ఆ మురుగు నీటి కాలువలో పడడం కూడా జరిగింది. అయినా ఏ అధికారీ పట్టించుకోడు, ఎందుకంటే వారికి సంవత్సరానికి ఒకసారి టాక్స్ వసూలు చెయ్యడం మాత్రమే ముఖ్యం. ఇవ్వంతా హెల్త్ డిపార్ట్మెంట్కి కనపడవా?పలమనేరు మరియూ చిత్తూరు ఎక్కడికి ప్రయాణం చెయ్యాలన్నా కూడా ప్రతి ఒక్కరూ అదే రోడ్డులో ప్రయాణం చెయ్యాలి. అయినా ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోకపోవడం సిగ్గు చేటు. కొత్త కొత్త రోగాలు వచ్చి జనాలు పోతుంటే, ఇలాగ కాలువలు రోడ్ల మీదనే వదిలిపెడితే, ప్రజలు మరియూ అక్కడ వ్యాపారాలు చేసుకునే వారు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారో కొంచం అయినా పట్టించుకుంటే అధికారులు బాగుంటుంది. అంతే కాక ఈ మురుగు నీటి కాలువ నేరుగా పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ముందు వైపే వెళ్తుంది, వచ్చే రోగులు ఇంకా రోగాలు పెంచుకోడానికా అన్నట్లు ఉంది. దయచేసి ఇకనైనా సంబంధిత అధికారులు (హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీ సిభంది,హెల్త్ మినిస్టర్ మరియూ దీనికి సంబంధిత శాఖ) వెంటనే స్పందించి ఈ మురుగు నీరు ఇలా రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. ఇది ఇంకా కూడా ఇలానే ఈ ప్రభుత్వంలో కూడా పట్టనట్లు వదిలేస్తే 100% పై స్థాయిలో (మంత్రి నారా లోకేష్ కి) కంప్లైంట్ చేయవలసి వస్తుంది. ఈ ఫొటోస్ చూసి అయినా స్పందించండి ఒక వేల మాకు తెలియదు అని చెప్పాలి అనుకుంటే. మేము పడుతున్న ఇబ్బందులు అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాము