
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు , శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో పాల్గొని, శ్రీ గౌరీ శంకరుల ను దర్శనం చేసుకుని, ఆలయ కమిటీ వారికి 15,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు & నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు & ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు మాట్లాడుతూ, శ్రీ గౌరీ శంకర మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.