
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:నిరుపేదల అనారోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిది సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు,రాచపల్లి,పోతులూరు, కత్తిపూడి,కొంతంగి కొత్తూరు గ్రామాల లబ్ధిదారులకి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా రూ.24,50,339 విలువైన చెక్కులను శనివారం పెదశంకర్లపూడి టిడిపి కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం బడుగు,బలహీన వర్గాల సంక్షేమం,ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.రాష్ట్రంలో వైద్యం,విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ బోర్డు,గ్రామీణ పరిశ్రమల డైరెక్టర్ కొమ్ముల కన్నబాబు,రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు (శివ),నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్,సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్,ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి యాళ్ల జగదీష్,ఉత్తరకంచి సర్పంచ్ మంతెన వెంకటరమణ,నాయకులు బుద్ధరాజు గోపిరాజు,గాబు కృష్ణమూర్తి,పంచాది వీరబాబు, అమరాది వెంకటరావు,పోలం చిన్నా, మిరియాల శ్రీను,పోలిశెట్టి శ్రీనివాస్,మదినే దొరబాబు,కంచిబోయిన శ్రీను,సకురు విష్ణు తదితరులు పాల్గొన్నారు.