
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-6 యాదమరి మండలంలో ఇటీవల బదిలీపై చేరిన ఉపాధ్యాయులకు పి.ఆర్.టి.యు సముచిత గౌరవం, వారి పాత్రకు తగ్గ బాధ్యతలు అప్పగించినట్లు మండల అధ్యక్షులు ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి.సురేష్ రెడ్డి తెలిపారు. కె.ఆర్.పి హైస్కూల్ విభాగం కార్యదర్శిగా కె.భారతి, సి.పి.ఎస్ కన్వీనర్‌గా కె.ఆష, మండల మహిళ ఉపాధ్యక్షురాలిగా సి.రేఖ, మహిళా కార్యదర్శిగా భార్గవిని నియమించారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా విజయ్‌కుమార్, రాజా, లక్ష్మీదేవి, రాజేశ్వరి తదితరులను నియమిస్తూ పి.ఆర్.టి.యు కొత్తతోటి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కనకాచారి, రాష్ట్ర కౌన్సిలర్ జె.భాస్కర్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతలు కల్పించడం పట్ల జె.హిమబిందు, ఆనందపిళ్లై, హరికృష్ణ, సి.రమేష్, మోహన్ కుమార్, లతారమణి, మురళిబాబు, విశ్వనాథ్, సుశీల, వెంకటరమణ, షకీల్, అఖిలాండేశ్వరి, సరస, తులసిరామ్, రాఘరాం తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. యాదమరిలో పి.ఆర్.టి.యు కొత్త తరానికి అవకాశం ఇవ్వడం ద్వారా సంఘ బలపరిచే దిశగా ముందడుగు వేసిందని ఉపాధ్యాయ వర్గం అభిప్రాయపడింది.