
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు శనివారం స్వాతంత్ర సమరయోధులు ,భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ సి బ్లాక్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మన్నెం పెంచల నాయుడు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా కరణం హజరత్ నాయుడు మాట్లాడుతూ… దేశంలోని యువత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించుటకై కృషి చేయవలసిందిగా కోరడం జరిగింది.పై కార్యక్రమంలో పెంచలయ్య, పరశురాం, దాసరిపెంచలయ్య ,గొలగమూడి, నారాయణ, హరిబాబు, నాని సామ్యూల్, అలగల దయాకర్ ,మాల్యాద్రి ,గుడివాడ వాసు ,కర్నాటి పవన్ ,రంగన్న, మురగ, అశోక్, వెంకటేష్, రాజేష్, మహిలిం, మేదరమెట్ల రమణయ్య నాయుడు ,మాజీద్ ,ఆనంద్, సెంట్రింగ్ చిన్న ,డిష్ చిన్న ,మస్తాన్, మీరా, వెంకటరత్నం, షఫీ, భార్గవ్ లు పాల్గొనడం జరిగింది.
