
ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగకరంగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రిమోడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:
నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రజా మరుగుదొడ్లను శనివారం రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ,ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు.రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి రోడ్డు పనులకు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని మోడరన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు….. మరుగుదొడ్ల సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సురేష్ రెడ్డి తన దృష్టికి తీసుకుని వచ్చారని తెలిపారు. ఆ ప్రాంతాన్ని అధికారులతో వచ్చి పరిశీలించామని మోడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.. ఆర్టీసీ ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చన్నారు.ఆర్టీసీ బస్టాండ్ సందులో రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరినట్లు మంత్రి అన్నారు. కూటమిది ప్రజా ప్రభుత్వమని సమిష్టి కృషితోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిషన్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.