
తొట్టెంపూడి కుటుంబ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే దంపతులు. ఎస్వీ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జైష్ణవ్ తొలి పుట్టినరోజు సంబరాలు.
వింజమూరు, మన ధ్యాస న్యూస్ డిసెంబర్ 5, (కె నాగరాజు) వింజమూరు మండల కేంద్రంలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో తొట్టెంపూడి వెంకట సతీష్, హిమబిందు దంపతుల పుత్రుడు చిన్నారి జైష్ణవ్ తొట్టెంపూడి మొదటి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంతోషోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్,ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ చిన్నారిని అక్షింతలతో ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో సర్వాంగ సుందరంగా ఎదిగి కుటుంబానికి, సమాజానికి గౌరవం తెచ్చే విధంగా దేవుని ఆశీర్వాదాలు ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వేడుక ప్రాంగణం సందడి, బంధుమిత్రుల, కుటుంబ సభ్యుల, స్నేహితుల హర్షధ్వానాలతో నిండిపోయి, చిన్నారి జైష్ణవ్ తొలి పుట్టినరోజు వేడుకను మరింత జ్ఞాపకార్థకంగా మార్చింది.
