
కలిగిరి, మనధ్యాసన్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో కలిగిరి జడ్పిటిసి సభ్యులు పాలూరి మాల్యాద్రి రెడ్డి వైఎస్ఆర్సిపి కలిగిరి మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి సూచనలతో ఎస్సీ విభాగంలో చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, లేని 150 కోట్ల ఆరాధ్య దైవం, అని అంన్నారు. అంతే కాకుండా, అంటరానితనం, వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన పూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాణంలో తీరిక పాత్రధారి, భారతరత్న బిఆర్ అంబేద్కర్ అని అన్నారు.అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పరితపించి మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన స్ఫూర్తి ప్రదాత,ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సి విభాగం, యాలపల తిరుపాలు,కూనిపోగు యిర్మీయ మనుబోలు వెంకటరమణయ్య, కర్ర చిన్న, షేక్ కాజా మొహిద్దిన్,పుల్లా వేమయ్య, తదితరులు పాల్గొన్నారు
