
మన ధ్యాస,తిరుపతి, :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కందాటి సురేష్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి కొందటి సురేష్రెడ్డిశనివారం బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి కందాటి సురేష్ రెడ్డి తో పాటు తో పాటు టిడిపి నగరం మాజీ అధ్యక్షులు జెడబ్ల్యు విజయ్ కుమార్, ఎం ఆర్ పల్లి ఎన్ రామచంద్రారెడ్డి, జయచంద్ర, మధు యాదవ్ లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అని, అట్టడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాయలు నాయుడు, ఎస్సీ సెల్ నేత గంగులయ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.