
సీతారామపురం, మన ధ్యాస, డిసెంబర్ 5, (కె నాగరాజు).
సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి గ్రామానికి చెందిన మహిమలూరి వెంకటేశ్వర్లు (27) మారంరెడ్డిపల్లి సచివాలయం లో జూనియర్ లైన్మెన్గా బాధ్యతలు నిర్వహిస్తూ, గత సోమవారం ఆయనకు హఠాత్తుగా గుండెనొప్పితో, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వ్యక్తిగతంగా వారి నివాసానికి చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్ర విషాదాన్ని అర్థం చేసుకుంటూ, ఎమ్మెల్యే గారు వారికి ధైర్యం చెబుతూ, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు ఆత్మస్థైర్యమును శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా, తోడుగా ఉంటామని హామీ ఇస్తూ, అవసరమైన అన్ని విధాములుగా సహాయం అందిస్తామని తెలిపారు
