
తవణంపల్లె, మన ధ్యాస, డిసెంబరు-4: చిత్తూరు జిల్లా ఎస్.టి.యు. శాఖ కార్యాలయంలో తవణంపల్లి మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మధు బాబు అధ్యక్షుడిగా, వినాయక రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, భువనేశ్వర్ రెడ్డి ఆర్థిక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే జయశంకర్ ఉపాధ్యక్షుడిగా, మమత మహిళా కన్వీనర్‌గా, చేతన్ కుమార్ సి.పి.ఎస్. కన్వీనర్‌గా ఎంపికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్, జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ కన్వీనర్ దేవరాజులు రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యమని, సంఘ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.