

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ నామినేషన్ గురువారం ఉత్సాహభరితంగా,భారీ జనసందోహంతో విజయవంతంగా జరిగింది. గ్రామ నాయకులు, కార్యకర్తలు,మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీకి విశేష స్పందన తెలిపారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొని నాయకులు,కార్యకర్తలకు మరింత ఉత్సాహం నింపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ —
కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం నాయకులు,కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ పార్టీ అభ్యర్థులను విజయపథంలో నడిపించాలని సూచించారు.
అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామంలో వంటి మౌలిక వసతుల పనులు మరింత వేగవంతం అవుతాయని, అలాగే సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు దగ్గరగా చేరుతాయని ఆయన పేర్కొన్నారు.కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ ని భారీ మెజారిటీతో గెలిపించి గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,తదితరులు ఉన్నారు
