
కలిగిరి,మన ధ్యాసన్యూస్, అక్టోబర్ 04(నాగరాజు కె)
కలిగిరి మండల ప్రజలకు శుభవార్త తెలియజేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో శ్రీవాణి ట్రస్టు నిధులతో గ్రామాల్లోని ఆలయాలు, భజన మండపాలు,నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని రావులకొల్లు సర్పంచ్ పూసాల వెంగపనాయుడు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శ్రీ వాణి ట్రస్టు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ,కాలనీ వాసులకు ప్రాధాన్యతని ఇస్తుందని ఆయన అన్నారు.కావున మన కలిగిరి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆలయాలు, భజన మండపాలు, నిర్మాణాలు అవసరమైన వారు ఆయా గ్రామాల్లోని మన తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులను సంప్రదించి వివరాలను సేకరించాలని వెంగపనాయుడు పేర్కొన్నారు. మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో ఆయా గ్రామాల్లో నిర్మాణాలుచేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు