
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:చాతుర్య పుట్టినరోజు సందర్బంగా, ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఏం ఫర్ సేవ ఆశ్రమంలో ఉన్న పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు పిల్లలతో ఘనంగా చేసుకొని పండ్లు,బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం సిరి ఫాస్ట్ ఫుడ్ కృష్ణ ఆధ్వర్యంలో పిల్లలకు భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు మీరు ఎదగాలని కోరుకుంటున్నాను.చాతుర్య పుట్టినరోజు గుర్తుగా ఆశ్రమంలో మొక్కనీ నాటి ప్రతి ఒక్కరు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు గుర్తుగా ఒక మొక్క నాటాలని పకృతి పర్యవరణాన్ని కాపాడడం మన బాధ్యత అన్ని అన్నారు.