మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఇటీవలే విడుదలై యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సత్తాచాటి అశ్వాపురం మండలంలో విజయం సాధించి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బూర్కా అశోక్, వైస్ ప్రెసిడెంట్ గా గొల్లపల్లి నరేష్ కుమార్ ఎన్నికైన సందర్భంగా ఆదివారం మణుగూరు ప్రజా భవనంలో మర్యాదపూర్వకంగా కలవగా వారికి స్వీట్ తినిపించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..యూత్ కాంగ్రెస్ లో సత్తా చాటిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని యూత్ కాంగ్రెస్ ని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, మట్ట వీరభద్రారెడ్డి, పాయం సర్వేశ్వరరావు, పొడియం అనిల్, గుడ్ల వెంకన్న, రాజేష్, పండు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.