మన న్యూస్: తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయకమిటి ఆధ్వర్యంలో స్థానిక కపిలతీర్థం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి కాధన్వంత్ కుమార్ మరియు అధ్యక్షులు p. విజయభాస్కర్ ప్రసంగిస్తూ కార్తీకమాసం సంధర్భంగా భక్తులకు మరియు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు సామాజిక సేవలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గత ఏడు సంవత్సరాలనుంచి అనందాన కార్యడమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రజలందరికి వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయని, ప్రజలందరు బ్యాంకు ఖాతాలను పొంది బ్యాంకులు అందిస్తున్న నేవలను సద్వినియోగపరచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు భాస్కర్, జనార్ధన్, సుమలత, రేష్మ, నిర్మల, వెంకట లక్ష్మి, మహేష్, కేశవరెడ్డి, యజ్ఞేష్ బాబు, నట్రాజ, పవన్, లక్ష్మీపతి, శంకర్రావు, నందగోపాల్ మరియు ఇతర బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.