
మన ధ్యాస,నెల్లూరు., డిసెంబర్ 1: మంది అరేబియన్ రెస్టారెంట్ ను సింహపురి ఆహార ప్రియులు సందర్శించి ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో మంది అరేబియన్ రెస్టారెంట్ ను సింహపురి ఆహార ప్రియులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు అంటేనే ఆహార రుచులకు పెట్టిన పేరు అని అన్నారు. నెల్లూరు చేపల పులుసు అంటే ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు. అటువంటి సింహపురిలో నూతన వెరైటీతో, అధునాతన సదుపాయాలతో నెల్లూరు నగర్ నడిబొడ్డున ఏర్పాటైన మంది అరేబియన్ రెస్టారెంట్ రుచులను సింహపురి యువత రుచి చూడాల్సిందేనన్నారు. ఓకే ప్లేట్ పై కుటుంబంలోనే భార్యాభర్త పిల్లలు సుమారు 5 మంది వరకు కూర్చుని తినగలిగే వెరైటీ చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీలను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తో పాటు టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



