
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు పిలుపునిచ్చారు.సోమవారం ప్రత్తిపాడు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామిశెట్టి నాని ఆధ్వర్యంలో ప్రత్తిపాడు మండలంలో ఉన్న వెంకటనగరం,తోటపల్లి గ్రామాలకు చెందిన పలువురు వైసిపి నాయకులు,కార్యకర్తలు మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు కిర్లంపూడి ముద్రగడ నివాసంలో ముద్రగడ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి గిరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలింబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా,రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.గిరిబాబును కలిసిన వారిలో మాజీ సర్పంచ్ కోరాపు గంగరాజు,ముప్పిడి నూకరాజు,ఏనుగు మరిడియ్య,యెనుముల దొరబాబు,సింహాద్రి కుమార్ బాబు,అనిశెట్టి వీరబాబు,నాగం శివరామకృష్ణ,సింహాద్రి రామన్నదొర, సింహాద్రి గొల్లబాబు,తోట నాగేశ్వరావు,సింహాద్రి సాయి, మలిరెడ్డి నాగేంద్ర,మలిరెడ్డి బాబి,కాబోజు మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.