
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం లో గౌరీసంఘం అధ్వర్యంలో డిసెంబర్ 10న నిర్వహించనున్న గౌరీమాత మహోత్సవానికి ముఖ్య అతిధిగా హజరుకావాలని రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మెన్ మళ్ళ సురేంద్రకు ఆ సంఘ పెద్దలు కోడెల శివన్నారాయణ,శరకణం రాంబాబు,భీశెట్టి సత్తిబాబు,ఆడారి అప్పన్న,శరకణం ఈశ్వరుడు,పెంటకోట సత్తిబాబు,బుద్ధ ఈశ్వరరావు,మళ్ల ప్రసాద్ పిలుపు మేరకు పెద్దనాపల్లి యూత్ కమిటీ సభ్యులుఆహ్వాన పత్రికను అందజేశారు.అనకాపల్లిలోని సురేంద్ర స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి అహ్వన పత్రికను అందచేసారు.ఈ సందర్భంగా మళ్ల సురేంద్ర మాట్లాడుతూ పెద్దనాపల్లిలో గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులను అభినందించారు. అలాగే డిసెంబర్ 10 న జరిగే గౌరీమాత మహోత్సవానికి విధిగా హజరవుతానని సురేంద్ర తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పెద్దనాపల్లి గౌరీ సంఘ ప్రతినిధులు వేగి వీర ప్రభాకర్,వేగి నగేష్,పెంటకోట శ్రీను,మళ్ల మురళి,పొలమరశెట్టి తేజ,పొలమరశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.