
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.సునీత పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించబడుతుందని, హెచ్ఐవి పై అవగాహన పెంచి అపోహను తొలగించాలన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం గా ఏర్పడ్డారు.ఈ కార్యక్రమంలో ప్రయాగమూర్తి ప్రగాఢ,కే. వెంకటేశ్వరరావు,ఎస్కే మదీనా,శివ ప్రసాద్, కే బంగార్రాజు,శ్రీలక్ష్మి, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.