
యాదమరి, మన ధ్యాస నవంబర్-30: యాదమరి మండలంలోని యాదమరి హైస్కూల్ ప్రాంగణంలో నేడు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో పదవీవిరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి, యాదమరి హైస్కూల్లో తన కర్తవ్యనిర్వహణలో ఆదర్శంగా నిలిచిన లక్ష్మిప్రసాద్ ని పి.ఆర్.టి.యు నాయకులు శాలువ, మోమెంటో, పూలహారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గిరిప్రసాద్, కనకాచారి, జిల్లా నాయకులు విజయభాస్కర్ రెడ్డి, నరేంద్రరెడ్డి, షకీల్, రమేష్, అలాగే జిల్లా కౌన్సిలర్ సి. రమేష్, యాదమరి మండల నాయకులు శివప్రసాద్, బి. సురేష్ రెడ్డి, ఆనంద పిళ్లై, హరికృష్ణ, లతరమణి, లీలారాణి మండల కోశాధికారి తులసిప్రసాద్ నాయుడు, విశ్వనాధ్, సి. త్రివేణి తదితరులు పాల్గొన్నారు. పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయుల సుదీర్ఘ సేవలను స్మరిస్తూ నాయకులు అభినందనలు తెలియజేశారు.