
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నూతనంగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శుక్రవారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.జిల్లా కాంగ్రెస్ బలోపేతం దిశగా నాయకులందరితో సమన్వయం కొనసాగిస్తూ ముందుకు సాగుతానని ఏలే మల్లికార్జున్ ఈ వేళ చెప్పారు. పార్టీ బలపరిచే కార్యక్రమాల్లో అనుభవజ్ఞులైన నేతల సహకారం అమూల్యమని ఆయన పేర్కొన్నారు. నాయకత్వ మార్పుతో జిల్లా కాంగ్రెస్ మరింత చైతన్యవంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.భాస్కర్ రెడ్డి మల్లికార్జున్‌కు అభినందనలు తెలుపుతూ,పార్టీ విస్తరణలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.జిల్లా కాంగ్రెస్ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎన్ ఆర్ ఐ బుజంగారి భాస్కర్ రెడ్డి,తదితరులు ఉన్నారు.