మన న్యూస్: పిర్జాదిగుడ మున్సిపల్ కార్పొరేషన్ లోని బుద్ధ నగర్ రోడ్ నెంబర్ 2 లో స్వప్న ఉప్పల నేత్రత్వంలో ఈవైబర్ ఐకాన్ ప్రైవేట్ లిమిటెడ్ బైక్ షోరూమ్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు,పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యాపారం మంచి లాభాలతో ముందుకు సాగాలని ఈవైబర్ ఐకాన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సి.ఎం.డి స్వప్న ఉప్పల మాట్లాడుతూ హైదరాబాదులో ఇది తమ మొదటి షో రూమ్ అని,తమ ఇవి బైక్స్,స్కూటర్స్ కేవలం 3 గంటల ఛార్జింగ్ తో 70 కిలోమీటర్ల నుండి 140 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందని తెలిపారు.తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు ధర కూడా పేద,మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా రూ.65,000 ప్రారంభ ధరగా నిర్ణయించారు.ఈవి బైక్స్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు భవిష్యత్తు ఇంధన అవసరతలను కూడా తీరుస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈవైబర్ ఐకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ యాదగిరి,కార్పొరేటర్ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, వంగేటీ ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.