
మన దాస్య,నిజాంసాగర్ ,(జుక్కల్): అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీని సంపూర్ణ పారదర్శకతతో నిర్వహించేందుకు సంబంధిత వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి కార్యకర్తలకు సూచించారు.
శుక్రవారం ఒడ్డేపల్లి గ్రామంలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సెక్టర్ సమావేశంలో ఆమెమాట్లాడారు…అంగన్ వాడీల్లో చిన్నారులు, గర్భిణులు,బాలింతలకు అందించే అండర్న్యూట్రిషన్ నివారణ కార్యక్రమాలు సమర్థవంతంగా సాగాలంటే ఆన్లైన్ అప్డేట్లు అత్యంత కీలకమని తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల ఎస్ఆర్సీ నమోదు,హాజరు వివరాలు,పౌష్టికాహారం సరఫరా,పంపిణీ వంటి వివరాలను రోజువారీగా రికార్డు చేయాలని ఆమె సూచించారు.కార్యకర్తలు ప్రభుత్వ మార్గదర్శకాలు,కొత్త మార్పులపై అప్రమత్తంగా ఉండి, ప్రతి కేంద్రంలోని సేవలు లబ్ధిదారులకు సమయానికి అందేలా కృషి చేయాలని చెప్పారు.ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
సమావేశంలో అంగన్వాడీ సంఘం అధ్యక్షులు రోజా, టీచర్లు విజయలక్ష్మి,ప్రమీల, విజయలక్ష్మి,లలిత, సాయవ్వ, సావిత్రి,మైశకళ తదితరులు పాల్గొన్నారు.