మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అంజనాద్రి ఆలయ వార్షికోత్సవాలు అంగంరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యేకు అంజనాద్రి సమస్త నిర్వాహకులు పట్లోల కిషోర్ కుమార్ అంజనాద్రి శిలాఫలకం చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు అందించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి,నాయకులు తదితరులు ఉన్నారు.